UPDATE TTD WEBSITE WITH INFO ON LOCAL TEMPLES OF TTD-EO _ టీటీడీ స్థానికాలయాల సమాచారంతో వెబ్‌సైట్ ఆధునీకరణ- ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TIRUPATI, 12 DECEMBER 2023: TTD EO Sri. AV Dharma Reddy ordered the officials to update the website with all the details to give wide publicity to the TTD local temples and affiliated temples in Tirupati and other areas. The EO conducted a review of the local temples at the TTD administration building in Tirupati on Tuesday.
Speaking on this occasion, the EO said that there are more than 60 local temples and affiliated temples under TTD, and requested JEO Sri Veerabrahmam to inform the devotees about the location, arjita sevas, darshan hours and other facilities related to these temples through the website.
In the past TTD used to make publicity with pamphlets and propaganda materials available to the devotees in different ways, and in the recent trend towards digital media, it is suggested to modernize the website and through SVBC.
The EO instructed the SVBC to make short video clips related to the uniqueness of the temple and take it to the masses through various media. That way more people will know about the temples.
FACAO Sri Balaji, DyEO General Sri Sivaprasad, IT GM Sri Sandeep and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ స్థానికాలయాల సమాచారంతో వెబ్‌సైట్ ఆధునీకరణ- ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2023 డిసెంబరు 12: తిరుపతి, ఇతర ప్రాంతాల్లో గల టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేదిశగా అన్ని వివరాలతో వెబ్‌సైట్‌ను ఆధునీకరించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం స్థానికాలయాలపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో 60కి పైగా స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలు ఉన్నాయని, వీటికి సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, ఇతర సౌకర్యాలను వెబ్‌సైట్ ద్వారా భక్తులకు తెలియజేయాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మంను కోరారు. గతంలో కరపత్రాలు, విభిన్న పద్ధతుల్లో ప్రచారసామగ్రిని భక్తులకు అందుబాటులో ఉంచేవారమని, ఇటీవల డిజిటల్ మీడియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌ను ఆధునీకరించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా ఆలయ విశిష్టతకు సంబంధించి స్వల్ప వ్యవధిగల వీడియో క్లిప్‌లు రూపొందించి వివిధ మాధ్యమాల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కోరారు. తద్వారా ఎక్కువమందికి ఆలయాల సమాచారం తెలుస్తుందన్నారు.
ఈ సమావేశంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో(జనరల్) శ్రీ శివప్రసాద్, ఐటి జిఎం శ్రీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.