EO AND JEO(H&E) LAUD DOCTOR FOR THE AWARD _ డా.ఎం.జ‌య‌చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు

Tirupati, 18 December 2023: Dr M Jayachandra Reddy, Oncology specialist and OSD at Srinivasa Balaji Institute of  Oncology, SVIMS who bagged the prestigious award of Young Surgeon of India given by the Association of Surgeons of India.

TTD EO Sri AV Dharma Reddy and JEO for Health and Education Smt Sada Bhargavi lauded the SVIMS doctor who is also an honorary advisor to the Government of AP on Cancer treatment and chemotherapy daycare centres.

The award was presented to Dr Jayachandra Reddy at its annual convention held at Visakhapatnam.

The Association of surgeon India (ASI) set up in 1938  has been giving away the prestigious award after selection by senior experts committee selection for young surgeons below 40 years of age.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డా.ఎం.జ‌య‌చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు

– అభినందించిన టీటీడీ ఈవో, జెఈవో

– టీటీడీ వైద్యునికి అరుదైన గౌర‌వం

తిరుపతి, 2023 డిసెంబ‌రు 18: స్విమ్స్ ఆధ్వ‌ర్యంలోని శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్ర‌త్యేకాధికారి డా.ఎం.జ‌య‌చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు ల‌భించింది. టీటీడీ వైద్యునికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి డా.ఎం.జ‌య‌చంద్రారెడ్డిని అభినందించారు.

విశాఖపట్నంలో జ‌రిగిన‌ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సదస్సులో డాక్ట‌ర్‌.మెట్టా.జయచంద్రారెడ్డికి “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు ప్ర‌ధానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకొంటున్న మొద‌టి వ్య‌క్తి డా.జయచంద్రారెడ్డి. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క్యాన్స‌ర్ నిర్థార‌ణ – నివార‌ణ‌, కీమోథెరపీ డే కేర్ సెంటర్ల‌కు గౌర‌వ స‌ల‌హాదారులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ప్రధాన కార్యాలయంలోని సీనియర్ సర్జన్ల నిపుణుల కమిటీ దేశంలోని యువ (40 సంవత్సరాలలోపు) వారి నుండి ప్రతిష్టాత్మకమైన “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి “యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. 1938లో సంస్థ ఏర్పడిన‌ప్ప‌టి నుండి మొద‌టిసారిగా విశాఖపట్నంలో తన వార్షిక జాతీయ మహాసభలను నిర్వహిస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.