డిశెంబర్‌ 16  నుండి జనవరి 14 వరకు దేశంలోని 200 కేంద్రాలలో తిరుప్పావై ప్రవచనాలు

డిశెంబర్‌ 16  నుండి జనవరి 14 వరకు దేశంలోని 200 కేంద్రాలలో తిరుప్పావై ప్రవచనాలు

  తిరుపతి, డిశెంబర్‌-15, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిశెంబర్‌ 16  నుండి జనవరి 14 వరకు దేశంలోని సుమారు 200 కేంద్రాలలో తిరుప్పావై ప్రవచణ కార్యక్రమం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి.

శ్రీమహావిష్ణువుని శృతిస్తూ ఆయనను భర్తగా పొందాలని శ్రీగోదాదేవి ఆలపించిన పాటలను ఈ తిరుప్పావై ప్రవచణంలో పఠిస్తారు. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఈ తిరుప్పావై ప్రవచణం జరుగుతుంది. జనవరి 14వ తేదిన చివరి రోజు అన్నమయ్య కళామందిరంలో గోదా కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.