డిశెంబర్‌ 28న భజగోవిందం పఠన కార్యక్రమం

డిశెంబర్‌ 28న భజగోవిందం పఠన కార్యక్రమం

తిరుపతి, డిశెంబర్‌-18, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో డిశెంబర్‌ 28వ తేదిన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాలలో భజగోవిందం పఠన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తితిదే కళ్యాణ మండపాలలో భజన పోటీలను నిర్వహిస్తారు.

అదేవిధంగా శ్రీవారు పద్మావతి అమ్మవార్ల 2010 నూతన సంవత్సర పాకెట్‌ క్యాలెండర్లు, శ్రీహరినామ మహిమ తదితర తితిదే ప్రచురణలను భక్తులకు పుస్తకప్రసాదం క్రింద ఉచితంగా పంపిణీ చేస్తారు.

ప్రతి జిల్లా కేంద్రాలలో ధర్మప్రచార పరిషత్‌ భజన మండళ్ళ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేది నుండి 20వ తేది వరకు ఈభజన పోటీలు జరుగుచున్నవి. ఇందులో ఎంపిక చేసిన భజనమండళ్ళు 24వ తేది నుండి 27 వరకు తిరుపతిలో జరుగు రాష్ట్ర స్థాయి భజన పోటీలలో పాల్గొంటారు. ఈపోటీలలో రామభజన, చెక్కభజన, చిడతల భజన, చిటికెల భజన, పండరి భజన, కులుకు భజన, చెట్టు భజన, కోలాట భజన, బృందావనభజన, జక్కికి భజన, జడకోలాట భజన, వరద కోలాటం, తలభజన అను  13 రకాల భజన పోటీలు జరుగుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.