డిసెంబరు 17న విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు
డిసెంబరు 17న విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు
తిరుపతి, 2023 డిసెంబరు 12: డిసెంబరు 23న గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో డిసెంబరు 17న ఆదివారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరుగనున్నాయి. తిరుపతి జిల్లా లోని పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగంలో పోటీలు నిర్వహిస్తారు.
6, 7 తరగతుల విద్యార్థులు ఒక విభాగం గాను, 8, 9 తరగతుల విద్యార్థులు మరో విభాగంగాను పోటీలు నిర్వహిస్తారు. అదేవిధంగా, 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో 18 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఒక విభాగంగాను, 18 సంవత్సరాలు పైబడినవారికి మరో విభాగంగాను పోటీలు జరుగనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు 17వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలు ప్రతిభ గల ఐదుగురు విద్యార్థుల వివరాలను డిసెంబరు 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అన్నమాచార్య కళామందిరం లేదా శ్వేత భవనంలోని హిందూ ధార్మిక సంస్థల కార్యాలయంలో సమర్పించాలని కోరడమైనది.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.1000/-, రూ.750/-, రూ.500/- ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు. గెలుపొందిన విద్యార్థులకు డిసెంబరు 23న గీతాజయంతి రోజున బహుమతులు ప్రదానం చేస్తారు. ఇతర వివరాలకు 9676615643 నంబరులో సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.