TIRUPPAVAI PARAYANAMS AT PEDDA JEEYARSWAMY MUTT IN TIRUMALA _ డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం

Tirumala,11 December 2023: In view of Dhanur masa festivities between December 17 and January 14,2024, the Tiruppavai Parayanams will be observed at Sri Pedda Jeeyarswamy Mutt in Tirumala.

For the entire month, the  Tiruppavai Pashuras Parayanams will be chanted at the Sri Sri Periya Koil Appan Sri Shatagopa Ramanuja Pedda Jeeyar Swami Mutt between 7am and 8am. The same will be live telecast by the SVBC channel.

The Pedda Jeeyar Swamy Mutt was established at Tirumala during the Bhagavad Sri Ramanujacharya period who founded the Vishistadvaita philosophy. The Nitya Kainkaryas as propounded by Sri Ramanujacharya were in vogue and followed to date.

Likewise, Sri Pedda Jeeyar Swamy a descendant of Sri Ramanujacharya traditions is continuing the Kainkaryas, Sevas and utsavas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 డిసెంబరు 11: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సంద‌ర్బంగా డిసెంబ‌రు 17 నుండి 2024 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం చేయ‌నున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి మ‌ఠంలో నెల రోజుల పాటు ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల ప‌రంప‌ర‌లో వ‌స్తున్న జీయ‌ర్‌స్వాములు తిరుమల శ్రీ‌వారి ఆల‌య కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.