TIRUPPAVAI PRAVACHANAMS TO BEGIN FROM DECEMBER 16 _ డిసెంబరు 16న తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

Tirupati,14 December 2023: As part of Dhanur masa festivities TTD’s Alwar Divya Prabanda Project is organising Tiruppavai Pravachanams by eminent scholars at four locations in Tirupati city besides 216 places across the nation.

 

At Tirupati on Saturday evening 5.30pm the Pravachanams will commence at Annamacharya Kalamandiram with pravachanams by Tirumala Jeeyarswamis and Acharya  Chakravarti Ranganathan.

 

Till the end of Dhanurmasam, the pravachanams will be performed at Annamacharya Kala mandir, Sri Varadaraja Swami temple at KT road, Gita Mandiram in Ramnagar Sri Lakshmi Narayana temple at South Mada street of  Govindarajaswami temple and finally Kalyana Venkateswara Swamy temple in Tirumalagunta.

 

Similarly, the holy Pravachanams will be performed by eminent scholars appointed by  TTD at 216 cities and towns across AP, Telangana, Tamilnadu, Karnataka, Puducherry, Maharashtra, Odisha also.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 16న తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

– తిరుప‌తిలో నాలుగు చోట్ల ప్ర‌వ‌చ‌నాలు

– దేశ‌వ్యాప్తంగా 216 కేంద్రాలు

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 14: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 16న శ‌నివారం సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరుగనుంది.

టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ‌ పెద్దజీయర్ స్వామి, తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఇత‌ర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆచార్య చక్రవరి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.

ధనుర్మాసం ముగిసే వరకు తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, రామ్‌న‌గ‌ర్‌లోని గీతామందిరం, గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ద‌క్షిణ మాడ వీధిలోని శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌స్వామివారి ఆల‌యం, తుమ్మ‌ల‌గుంట‌లోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాల పారాయణం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌హారాష్ట్ర‌, ఒడిశా రాష్ట్రాల్లోని 216 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.