తితిదే ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనం కోసం ధరఖాస్తు
తితిదే ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనం కోసం ధరఖాస్తు
తిరుపతి, ఆగష్టు -21, 2009: తితిదే ద్వారా పేద విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనము కొఱకై ధరఖాస్తు చేసుకొనుటకు సెప్టెంబర్ 30వ తేది చివరి తేదిగా నిర్ణయించడమైనది.
ఎస్.ఎస్.సి. మార్చి 2008-09 పరీక్షలయందు 500 లేదా అంతకు పైగా మార్కులు సాధించి, దారిద్య్రరేఖకు దిగువలో వున్న 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు తితిదే నెలకు రు.300/-ల చొప్పున ఒక్కొక్కరికి ఉపకార వేతనము అందజేస్తుంది. స్వామివారి ఆశీస్సులతో చదువుకు కలిగే అడ్డంకులను అధిగమించడానికి ఈచక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
మరిన్ని వివరాలకు స్కాలర్‌షిప్ సెల్ విద్యావిభాగం, తితిదే పరిపాలనాభవనము అను చిరునామాను సంప్రదించవలసిందిగా కోరడమైనది.
శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 22వ తేదిన సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నటించిన ”విప్రనారాయణ” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.
కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.