REVIEW ON PAT BTUs HELD _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 7 Nov. 19: No compromise on the arrangements for Ammavari annual brahmotsavams at Tiruchanoor, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting was held in the conference hall of TTD administrative building on Thursday.  The EO directed all departments to make elaborate arramgements for the mega religious fete which starts on November 23.

He instructed the engineering wing to make all necessary barricading, electrical illuminations, cleaning of temple tank, LED screens erection etc. And the garden wing to come out with interesting themes for exhibition. 

He also reviewed on security arrangements, sanitation, annaprasadam and other arrangements.

JEO Sri Basanth Kumar, Tirupati Urban SP Sri Gajarao Bhupal, CE Sri Ramachandra Reddy, Agama advisor Sri Srinivasacharyulu, Temple DyEO Smt Jhansi Rani and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు –
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 07: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 23 నుంచి డిసెంబరు 1వతేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో గురువారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్స‌వాల గోడ ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు.

     ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌త అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాలన్నారు. న‌వంబరు 30న రథోత్సవం సంద‌ర్భంగా మ‌హా ర‌థాన్ని శుభ్ర‌ప‌రిచి, బ్రేక్‌లు, త‌దిత‌ర మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన నవంబరు 27న గజవాహనం, న‌వంబరు 28న బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 1న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌, పోలీస్‌, ట్రాఫిక్‌, విజిలెన్స్ అధికారులు స‌మ‌య్వ‌యంతో వాహ‌నాల పార్కింగ్‌కు గ‌త ఏడాది కంటే అద‌న‌పు పార్కింగ్ స్థ‌లాల‌ను ముంద‌స్తుగా గుర్తించి, ఏర్పాటు చేయాల‌న్నారు.  

పంచ‌మితీర్థం రోజున ల‌క్ష‌లాదిగా విచ్చేసే భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని, అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు తోళప్ప గార్డెన్స్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచ‌మితీర్థం రోజున భ‌క్తుల‌కు ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం అన్న‌ప్ర‌సాద ప్యాకెట్లు, వాట‌ర్ బాటిళ్ళు అందివ్వాల‌న్నారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా  పుష్క‌రిణి చేరుకునేందుకు రూట్‌మ్యాప్, అందుకు అవ‌స‌ర‌మైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భక్తులకు వైద్యసేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగు 9 రోజుల పాటు  సంద‌ర్భంగా తిరుచానూరు ప‌రిస‌ర ప్రాంతాల‌లో మాంసం, మ‌ద్యం అమ్మ‌కాల‌ను నిషేధించాల‌ని పంచాయ‌తీ అధికారుల‌కు సూచించారు.

ఆలయం, పరిసర ప్రాంతాల‌తో పాటు తిరుప‌తి, అలిపిరి, ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో క‌టౌట్లు, విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా కనులవిందుగా  చేపట్టాలని ఆదేశించారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌న్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, తిరుప‌తి అర్బ‌న్‌ ఎస్‌పి డా.గ‌జారావు భూపాల్‌,  సిఇ శ్రీరామ‌చంద్రారెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.