తిరుచ్చిపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుచ్చిపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు
– రాత్రి 9:30 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
తిరుపతి, 18 నవంబరు 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి
7:30 గంటలకు అమ్మవారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడవీధులు విహరించి భక్తులను కటాక్షించారు.
రాత్రి 9.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించనున్నారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈఓ శ్రీ రమేష్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.