VOCAL CONCERT ALLURES _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
తిరుపతి, 2019 అక్టోబరు02,: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో బుధవారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్కు చెందిన బుర్రా పద్మశ్రీ మరియు ఎ.అక్షిత బృందం చక్కటి భక్తి సంగీతం వినిపించారు.
అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూణెకి చెందిన పి.నందినిరావు బృందం భక్తి సంకీర్తనలు వినిపించారు.
రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీ వీరారెడ్డి బృందం నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.