KOIL ALWAR TIRUMANJANAM HELD _ తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 03 APRIL 2024: Koil Alwar Tirumanjanam was observed in Sri Kodanda Ramalayam on Wednesday in connection with the annual Brahmotsavams from April 5 to 13.

After the traditional cleansing fete from 6:30am to 9am devotees were allowed for darshan.

Ankurarpanam for the annual fest will be on April 4.

PARADAS DONATED 

Hyderabad-based Smt Prasanna Reddy and Tirupati’s Sri Mani have donated huge temple curtains and handed over them to DyEO Smt Nagaratna.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 ఏప్రిల్ 03: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలీ గడ్డ , కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఆలయానికి పరదాలు విరాళం :

శ్రీ కోదండరామాలయానికి బుధ‌వారం హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు, తిరుప‌తికి చెందిన శ్రీ మ‌ణి అనే భ‌క్తుడు పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 4న అంకురార్పణ :

శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.