BHUMI PUJA PERFORMED AT TIRUMALA FOR KARNATAKA CHOULTRIES COMPLEX _ తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ‌

Tirumala, 24 Sep. 20: The Honourable Chief Minister of Andhra Pradesh Sri Y S Jaganmohan Reddy along with his Karnataka counterpart Honourable Sri BS Yediyurappa took part in the Bhumi Puja for the ₹200 crore new complex which will be constructed the land meant for Karnataka Choultries.

The new complex will be built in the 7.05 acres of land leased by TTD to Karnataka Charities in the year 2008. Recently both Government of Karnataka and TTD had agreed to build an accommodation complex at a cost of ₹200 crore.

Earlier the Karnataka Endowments Commissioner Smt Rohini Sindhuri made a power point presentation on the complex structure which will be coming up soon with 252 ordinary rooms for pilgrims, 32 suit rooms, 12 dormitories, Kalyana Mandapam and dining hall apart from the rejuvenation of the existing Pushkarani.

AP deputy CM Sri Narayanaswamy, Sri Allasani, TTD chairman Sri Y V Subba Reddy, state ministers Sri Valampalli Srinivasa Rao, Sri Peddireddy Ramachandra Reddy, Karnataka Endowment Minister Sri Srinivasa Poojary, MPs Sri Vemireddy Prabhakar Reddy, Sri Mithun Reddy, TTD EO Sri Anil Kumar Reddy, several MLAs, TTD board members, Additional EO Sri A V Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Sri Ramesh Reddy, CE Sri Ramesh Reddy, SE-2 Sri Nageswar Rao, EE Sri Jaganmohan Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ‌
 
తిరుమల, 2020 సెప్టెంబ‌రు 24: తిరుమలలో క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో రూ.200 కోట్ల‌తో నూతనంగా నిర్మించ‌నున్న వసతి స‌ముదాయాల‌కు  గురు‌వారం ఉద‌యం ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, గౌ|| శ్రీ బి.ఎస్‌.య‌డ్యూర‌ప్పలు క‌లిసి భూమిపూజ చేశారు.

తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టిటిడి లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో టిటిడి నిబంధనల మేరకు రూ.200 కోట్ల‌తో నూతన  వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టిటిడి మ‌ధ్య అంగీకారం కుదిరింది.  

అంత‌కుముందు క‌ర్ణాట‌క రాష్ట్ర ఎండోమెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి రోహిణి సింధూరి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా నూత‌నంగా నిర్మించే వ‌స‌తి స‌మూదాయాల వివ‌రాలు తెలియ‌జేశారు.

ఇందులో 242 యాత్రికుల వ‌స‌తి గ‌దులు, 32 సూట్ రూములు, 12 డార్మెట‌రీలు, క‌ల్యాణ‌మండ‌పం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్ర‌స్తుతం ఉన్న పుష్క‌రిణిని పున‌రుద్ధరిస్తారు. టిటిడి ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రులు శ్రీ నారాయ‌ణ‌స్వామి, శ్రీ ఆళ్ల నాని, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు‌, శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి, క‌ర్ణాట‌క రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శ్రీ‌నివాస పూజారి, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ మిథున్ రెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు యం.ఎల్‌.ఏలు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డి.పి.అనంత, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ ఎ.ర‌మేష్‌రెడ్డి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ ఇ – 2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.