PURASAIVARITHOTSAVAM IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

Tirumala, 11 February 2024: The 970th Avatarotsavam fete of Sri Ananthalwar, a prominent disciple of was observed in Anantalwar Gardens (Purasaivaritota) in Tirumala on Sunday under the auspices of TTD’s Alwar Divya Prabandha Project. 

 

On this occasion, more than 300  successors of Sri Anantalwar organized “Nalaira Divya Prabandha Gosthiganam”.

 

On this occasion, Tirumala Junior Pontiff Sri Sri Sri Chinna Jeeyar Swamy praised Sri Ananthalwar who started offering flowers to Swami during his 102 years of life span.

 

Later, a message was given on the life characteristics of the Anantalwar by eminent Sri Vaishnava scholars who attended the event from different parts of the country.

 

TTD Alwar Divya Prabandha Project Officer Sri Purushottam, Anantalwar Descendants Sri Rangacharyulu, Sri Govindacharylu and a large number of devotees participated in this program.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం
 
తిరుమల, 2024 ఫిబ్ర‌వ‌రి 11: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ రామానుజాచార్యుల శిష్యులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 970వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 300 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిస్వామి అనుగ్రహషణం చేస్తూ, తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులుగతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.  
 
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహషణం చేస్తూ, తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి, తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు.
 
తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ శ్రీ వైష్ణవ పండితులచే అనంతాళ్వార్ల జీవిత విశేషాలపై సందేశాన్ని ఇచ్చారు.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి శ్రీ పురుషోత్తం, అనంతాళ్వార్‌ వంశీకులు శ్రీ రంగాచార్యులు, శ్రీ గోవిందాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.   
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.