TTD EO EXTENSIVE INSPECTIONS IN TIRUMALA _ తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు
Tirumala, 13 October 2021: TTD Executive Officer Dr. KS Jawhar Reddy accompanied by senior officials made extensive inspections at Tirumala on Wednesday.
TTD EO inspected the Filter House at Lepakshi circle where water from several reservoirs of Tirumala is purified and heard from officials on the pumping systems.
Later he instructed the officials to test the filtered water every hour at the Labs before releasing it into the system for supply. He also directed officials to keep the filter house surroundings clear and also to dispose of the unused engineering material lying around.
Thereafter the TTD EO inspected the sanitization and garbage clearance arrangements in cottages and roads at ANC, Balaji bus stand, SMC, sub-way at Lepakshi circle, and car parking at Mullakunta Shankumetta rest houses and made valuable suggestions.
Similarly, he directed officials to prepare plans to make roads devotee friendly and void of traffic hurdles. Asked engineering officials to remove concrete wastes and barricades at Mullakunta car parking and also to lay tiles in the empty corridors in the Shankumetta and Seshadri Nagar, ANC region for benefit of devotees. He also directed the concerned to promote greenery in the vacant regions. On the occasion, officials explained the blueprint of a master plan on various development works at Tirumala to EO.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల, 2021 అక్టోబరు 13: టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం ఉదయం అధికారులతో కలిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా లేపాక్షి సర్కిల్ వద్ద గల ఫిల్టర్ హౌస్‌ను పరిశీలించారు. తిరుమలలోని వివిధ డ్యాంల నుండి వచ్చే నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారు, పంపింగ్ సిస్టమ్ గురించి అధికారులు ఈవోకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గంటకోసారి శుద్ధి చేసిన నీటిని ప్రయోగశాలలో పరీక్షించి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిల్టర్ హౌస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ పరికరాలను తొలగించి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
అనంతరం ఎఎన్‌సి, బాలాజి బస్టాండ్, ఎస్ఎమ్‌సి ప్రాంతాల్లోని రోడ్లు, కాటేజిల వద్ద పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్ఎమ్ సి, లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సబ్ వేలను, ముల్లగుంట, శంఖుమిట్ట విశ్రాంతి భవనము వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అదేవిధంగా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ముల్లగుంట కారు పార్కింగ్ ప్రాంతలో ఉన్న బ్యారికేడ్లు, కాంక్రీట్ వ్యర్థాలను తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శంఖుమిట్ట, శేషాద్రి నగర్, ఎఎమ్‌సి ప్రాంతాల్లో భక్తులు నడవడానికి వీలుగా కాళీగా ఉన్న ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయాలన్నారు. శంఖుమిట్ట నామాల పార్కు క్రింద ఉన్న ఖాళీ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించి మరింత అహ్లాదకరంగా తీర్చిదిద్ధాలని డిఎప్‌వో శ్రీ శ్రీనివాసులు రెడ్డిని ఆదేశించారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్లను ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ లోకనాధం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇఇ శ్రీ శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.