తిరుమలలో పిబ్రవరి 10న శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు

తిరుమలలో పిబ్రవరి 10న శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు

తిరుమల, 2 ఫిబ్రవరి 2013: ”కర్ణాటక జ్ఞాన గంగోత్రి”, ”కర్ణాటక సంగీత పితామహ”గా జగద్విఖ్యాతి గాంచిన కన్నడ వాగ్గేయకారులు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు తిరుమలలోని ఆస్థానమండపంలో పిబ్రవరి10వ తారీఖున తి.తి.దే దాససాహిత్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తి.తి.దే అధికార ప్రముఖులందరూ పాల్గొననున్నారు.
 
ఆదివారంనాడు ఉదయం 9.00 గం||ల నుండి తిరుమల ఆస్థానమండపంలో పురందర సాహిత్య గోష్ఠి కార్యక్రమాలు జరుగనున్నాయి.
 
కాగా సాయంత్రం 6.00 గం||లకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీమలయప్పస్వామివారు మరియు దేవేరుల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.