తిరుమలలో వరుణజపం

తిరుమలలో వరుణజపం

తిరుమల, అక్టోబర్‌-02, 2009: అక్టోబర్‌ 4వ తేది నుండి 8వ తేది వరకు తిరుమలలో వరుణజపం నిర్వహిస్తారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వుండాలనే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానమువారు తిరుమలలో వరుణజపం నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతున్నది. అందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేది  తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం ముఖమండపం నందు వరుణజపాన్ని ప్రారంభిస్తారు. అక్టోబర్‌ 8వ తేది పూర్ణాహుతితో ఈ వరుణజపం ముగిస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.