తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుపతి, జూలై 26, 2013: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఐడియాస్ ఇంజినీర్స్ అనే సంస్థ శుక్రవారం తిరుమల శ్రీవారికి 10 లక్షలా 11 వేలా 111 రూపాయలు విరాళంగా అందించింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిని ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సొమ్మును తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని దాతలు కోరారు.
జజజజజజజజజజజజ
జూలై 28న తితిదే కేంద్రీయ వైద్యశాలలో సంతానలేమి వైద్యశిబిరం
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల కేంద్రీయ వైద్యశాలలో జూలై 28వ తేదీ ఆదివారం మహిళలకు సంతానలేమి సమస్యల పరిష్కారానికి చెన్నైకి చెందిన అపోలో ఆస్పత్రి వైద్యులు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రముఖ వైద్యులు అపోలో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బి.శరత్ ఈ శిబిరంలో పాల్గొని చికిత్స చేయనున్నారు. తితిదే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రీయ వైద్యశాల ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎం.శ్రీరామమూర్తి తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.