AP GUV OFFERS PRAYERS AT SRIVARI TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్
Tirumala, 19 December: The Honorable Governor of AP Sri Abdul Nazeer on Tuesday offered prayers at Sri Venkateswara temple in Tirumala.
Earlier he was given a warm reception at Mahadwaram by TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy while the archakas welcomed with the traditional Istikaphal temple honours.
After Darshan of Mula Virat, the Governor and his entourage were offered Vedaseervachanam by Vedic pundits at Ranganayakula Mandapam.
Later the Chairman and EO presented Srivari Thirtha Prasadams and 2024 TTD Calendars and Diaries.
Temple Dyeo Sri Lokanatham, VGO Sri Nanda Kishore and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్
తిరుమల, 2023 డిసెంబరు 19: తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నందకిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.