ADDITIONAL EO INSPECTS DEVELOPMENT WORKS AT TIRUMALA _ తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌ను త‌నిఖీ చేసిన అద‌న‌పు ఈవో

Tirumala, 02 February 2022:  TTD Additional EO Sri AV Dharma Reddy on Wednesday morning along with officials inspected several ongoing development activities at Tirumala.

They included ongoing construction works at Sri Padmavati Rest House, Shila thoranam,13 rest houses at Balaji nagar etc. and directed the officials to complete them within stipulated time.

He also instructed health officials to undertake garbage clearance works at CRO, RTC bus station etc.

Earlier he interacted with devotees at CRO on facilities provided by the TTD and devotees expressed satisfaction.

Thereafter he also inspected the location chosen for building RTC bus electric charging station.

DyEOs Sri Ramesh Babu, Sri Lokanatham, Sri Bhaskar, Estate officer Sri Mallikarjun, VGO Sri Bali Reddy, Health officer Dr Sri Devi, EEs Sri Jaganmohan Reddy, Sri Surendranath Reddy, Garden Superintendent Sri Srinivasulu and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌ను త‌నిఖీ చేసిన అద‌న‌పు ఈవో

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 02: తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌తో క‌లిసి బుధ‌వారం విస్తృత త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా దాత‌ల స‌హ‌కారంతో శిలాతోర‌ణం, ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నాల స‌ముదాయం, హెచ్‌విసి, బాలాజి న‌గ‌ర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 13 విశ్రాంతి భ‌వ‌నాల ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించి, నిర్ణీత స‌మ‌యంలో ప‌నులు పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం సిఆర్‌వో, ఆర్‌టిసి బ‌స్టాండ్ ఎదురుగా మ‌రింత మెరుగైన పారిశుద్ద్య‌ ప‌నులు చేప‌ట్టాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు.

అంత‌కుముందు సిఆర్‌వో వ‌ద్ద టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాల‌ను గురించి ఆయ‌న భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌రువాత బాలాజి న‌గ‌ర్‌లో ఆర్‌టిసి బ‌స్సుల ఎల‌క్ట్రిక్‌ చార్జీంగ్ స్టేష‌న్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన స్థ‌లం, శ్మ‌శానం ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లిఖార్జున్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీ‌దేవి, ఇఇలు శ్రీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, గార్డెన్ సూప‌రిండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు ఈ త‌నిఖీల్లో పాల్గొన్నారు

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.