TRAINING PROGRAM HELD _ తిరుమ‌ల‌లో ఆరోగ్య విభాగం సిబ్బందికి అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు

Tirumala, 21 Feb. 22: Training programme to health workers on service rules was held at Asthana Mandapam in Tirumala on Monday.

 

This three-day program will conclude on Wednesday.

 

Retired Officer from TTD Sri Nagi Reddy imparted the staff of the Health Department on Service rules and regulations.

 

Health Officer Dr Sridevi, Sanitary inspectors and other staff were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో ఆరోగ్య విభాగం సిబ్బందికి అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 21: తిరుమ‌లలో విధులు నిర్వ‌హించే ఆరోగ్య విభాగంకు చెందిన 300 మంది రెగ్యుల‌ర్‌ సిబ్బందికి ఎపి ప్ర‌భుత్వ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌పై ఆస్థాన మండ‌పంలో శ్వేత‌ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్ర‌భుత్వ స‌ర్వీస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న‌, సెల‌వులు త‌దిత‌ర అంశాల‌పై నిష్ణాతులతో అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. త‌ద్వారా సిబ్బందిలో క్ర‌మ శిక్ష‌ణ పెంపొంది భ‌క్తుల‌కు మ‌రింత ఉన్న‌తంగా సేవ‌లందించేందుకు మూడు రోజుల పాటు ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌ద‌స్సులో ఆరోగ్య విభాగం అధికారిణి డా. శ్రీ‌దేవి, యూనిట్‌ అధికారి శ్రీ పి.అమరనాథరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ముర‌ళి, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, శ్రీ సుబ్బ‌రాయుడు, శ్వేత సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.