TTD GETS LICENSE TO SELL FERTILISERS MADE FROM WASTES, TTD EO _ తిరుమలలో ఈవో విస్తృత పర్యటన
Tirumala, 4 Nov. 20: TTD Executive Officer Dr KS Jawahar Reddy said on Wednesday that TTD has successfully procured a license for auction cum sale of fertilisers produced from garbage wastes matter collected in Tirumala.
Speaking to media persons after his extensive inspection of both solid and liquid waste management plants at Tirumala, TTD EO said 6,000 tons of fertilisers made from decomposed garbage was ready for auction-sale.
Earlier accompanied by the Additional EO Sri AV Dharma Reddy the TTD EO inspected the Anna Prasadam potu and Laddu Prasadam potu at Srivari temple, Boondi potu behind Srivari temple, Sannidhanam rest house, and Ashwini hospital, solid and liquid waste management centres.
He said the entire solid and wet waste of Tirumala was packed and transformed into ready to use fertilisers.
TTD EO said TTD has invited suggestions from experts on recycling of both liquid and solid wastes. He said drain waters of Tirumala are already used for gardening purposes and studies are now underway for its use in non-drinking purposes like toilets etc.
He has instructed engineering officials to explore options for use of drain waters so as to reduce water demand in Tirumala.
He enquired about security and vigilance arrangements at the Potu in Srivari temple He gave several instructions to engineering staff after inspecting the ongoing developments works at Boondi potu.
At the Sannidhanam rest house, he reviewed the sanitisation of rooms and directed officials to promote greenery and landscape in the region.
He also visited the Ashwini hospital were reviewed the doctor’s services patients, daily OPs and emergency cases etc. He also visited the Apollo cardiology treatment Centre, its super speciality equipment’s, and emergency services to patients etc.
Later he visited the solid waste management plant at Kakulakonda region and was briefed by officials as to how fertiliser was made from wastes and the precautionary steps taken.
He also inspected the Liquid waste management plant located near the Kalyana Vedika and reviewed the safety measures etc.
CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, SE-2 Sri Nageswar Rao, Health officer Dr RR Reddy, VGO Sri Manohar, CMO Dr Narmada were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఈవో విస్తృత పర్యటన
తిరుమల, 2020 నవంబరు 04: టిటిడి ఈవో డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం తిరుమలలో విస్తృతంగా పర్యటించారు. శ్రీవారి ఆలయంలోని అన్న ప్రసాదాల పోటు, లడ్డూ ప్రసాదాల పోటు, ఆలయం వెలుపల ఉన్న బూంది పోటు, సన్నిధానం అతిథి గృహం, అశ్విని ఆసుపత్రి, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
ఆలయం పోటులో భద్రత పరంగా తీసుకుంటున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. బూంది పోటులో జరుగుతున్న పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సన్నిధానం అతిథి గృహంలో గదులను పరిశీలించారు. గదుల శానిటైజేషన్, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని గార్డెన్ నిర్వహణపై ప్రత్యేక దృష్ఠి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అశ్విని ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాలు, రోజు వారి ఒపిలు, అత్యవసర కేసుల వివరాలను తెలుసుకున్నారు. అపోలో ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్డియాలజి చికిత్స కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులు, రోగులకు అత్యవసర పరిస్థితులలో అందించే వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను గురించి తెలుసుకున్నారు.
అనంతరం కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌ను పరిశీలించి చెత్త నుండి ఎరువు తయారుచేసే విధానం, ఇందుకు గాను తీసుకుంటున్న జాగ్రత్తలనుఅధికారుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత కల్యాణ వేదిక సమీపంలోని ద్రవ వ్యర్థాల నిర్వహణ ( లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌ను పరిశీలించారు.
ఎరువుల అమ్మకానికి లైసెన్స్ మంజూరు – ఈవో
ఈ పర్యటన అనంతరం ఈవో డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమిలో కుళ్లిపోయే వ్యర్థ పదార్థాల నుండి ఎరువును తయారు చేస్తున్నామన్నారు. ఈ రకంగా తయారైన ఆరు వేల టన్నుల ఎరువును టిటిడి వేలం ద్వారా విక్రయించడానికి అవసరమైన లైసెన్స్ బుధవారం (ఈ రోజు) మంజూరు అయిందన్నారు. భూమిలో కుళ్ళని వ్యర్థ పదార్థాలను విభజించి ప్యాకింగ్‌తో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. వీటిపై మరింత మంది నిపుణుల నుండి సలహాలు తీసుకుంటామన్నారు. మురుగు నీటిని శుభ్రపరిచి ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారని, ఈ నీటిని మరుగుదొడ్ల అవసరాలకు కూడా వాడే అవకాశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. దీని వల్ల తిరుమలలో నీటి వినియోగాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని ఈవో వివరించారు.
సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ ఇ -2 శ్రీ నాగేశ్వరరావు, ఆరోగ్య అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివో శ్రీ మనోహర్, సిఎంవో డా.నర్మద ఈ పర్యటనలో పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.