తిరుమ‌ల‌లో న‌గ‌దు, వ‌స్తువులు మిరిచిపోయి వెళ్ళిన భ‌క్తుల‌కు అంద‌జేసిన టిటిడి సిబ్బంది

తిరుమ‌ల‌లో న‌గ‌దు, వ‌స్తువులు మిరిచిపోయి వెళ్ళిన భ‌క్తుల‌కు అంద‌జేసిన టిటిడి సిబ్బంది

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 02: తిరుమలలోని కౌస్తుభం  విశ్రాంతి భవనములో  రూం నంబర్ 523 లో నెల్లూరుకు చెందిన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మరిచిపోయిన‌   రూ. 4,08,000/-, లేప్‌ టాప్ మరియు కెమారా వస్తువుల‌ను టిటిడి అధికారులు, సిబ్బంది శ‌నివారం రాత్రి వారికి అంద‌జేశారు.

శ్రీ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో కౌస్తుభం  విశ్రాంతి భవనములో శుక్ర‌వారం వ‌స‌తి పొందారు. శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం వారి స్వగ్రామానికి వెళ్ళు తొందరలో వారు తీసుకున్న గ‌దిలో న‌గ‌దు, వ‌స్తువులు  మిరిచిపోయి  వెళ్ళ‌రు. గ‌ది శుభ్రం చేయు  యఫ్. యం. ఎస్‌.  కార్మికులు గ‌దిలో ఉన్న వస్తువులను గుర్తించి వెంటనే డెప్యూటీ ఈవో శ్రీ  డి.దామోదరం, ఏఈవో  శ్రీ కె. మోహన్ రాజు, కౌస్తుభం సూపరింటెండెంట్ శ్రీ జి. కె. రవి కుమార్‌కు తెలిజేశారు. అనంత‌రం విజిలెన్స్ సిబ్బంది,  టిటిడి అధికారులు, కౌస్తుభం సిబ్బంది మ‌రిచిపోయిన వస్తువులను వారికి అంద‌జేశారు.
     

ఈ సంద‌ర్భంగా  శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌,అద‌న‌పు అవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, వ‌స‌తి విభాగం అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియ‌జేశారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.