HINDU DHARMA PRACHARA YATRA CONCLUDES AT TIRUMALA _ తిరుమలలో ముగిసిన హిందూ ధర్మ ప్రచార యాత్ర
– SARADA PEETHAM SEER OFFERS PRAYERS WITH 1200 DALIT AND TRIBAL DEVOTEES FROM VIZAG
Tirumala, 31 March 2021: The Hindu Dharma Prachara Yatra organised by the Junior Pontiff of Visakha Sarada Peetham Sri Sri Sri Swatmanandendra Saraswathi Swami which concluded on Wednesday at Tirumala.
Accompanied by1200 tribal and Dalit devotees from remote areas of Visakhapatnam, the pontiff came to Srivari temple in padayatra from PAC-3 and offered prayers at Srivari temple.
Thereafter they performed bhajans at the Nada Niranjanam platform and were presented religious books.
Speaking on the occasion the pontiff said he launched the Hindu dharma Prachara Yatra in 2019 to preserve Hindu dharma and stop conversions in the tribal belt.
He said the Yatra has traversed 33,000 kms in Telangana and Andhra Pradesh since its inception propagating the significance of Hindu dharma. The Yatra concluded at the abode of Sri Venkateswara Swamy in Tirumala on March 31, wherein he prayed for motivation to 1200 Dalits and tribals to take up Hindu Dharma propagation.
He said prayers were also offered to Sri Venkateswara to end the pandemic.
Later the pontiff also served Anna Prasadam at the Tarigonda Vengamamba Anna Prasadam Center to devotees and lauded the TTD for its stellar service to devotees strictly following COVID-19 guidelines.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ముగిసిన హిందూ ధర్మ ప్రచార యాత్ర
1200 మందికి పైగా గిరిజనులు, దళితులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి
తిరుమల, 2021 మార్చి 31: హిందూ ధర్మ ప్రచారం కోసం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి ప్రారంభించిన ప్రచారయాత్ర బుధవారం తిరుమలలో ముగిసింది. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన 1200 మందికి పైగా గిరిజనులు, దళితులతో కలిసి తిరుమల పిఏసి-3 నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించి మతమార్పిడులను అరికట్టేందుకు గిరిజన ప్రాంతాల్లోని హిందువులను చైతన్యపరచడం కోసం 2019లో హిందూ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 33 వేల కిలోమీటర్లకు పైగా మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు హిందూ మతం ఔన్నత్యాన్ని వివరించినట్టు చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో యాత్ర ముగించడం సంతోషంగా ఉందన్నారు. 1200 మందికిపైగా గిరిజనులు, దళితులతో స్వామివారిని దర్శించుకుని హిందూ ధర్మ వ్యాప్తికి తగిన శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్టు చెప్పారు. ప్రపంచం నుంచి కరోనా మహమ్మారిని నిర్మూలించి ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. విశాఖ శ్రీ శారదా పీఠం తరఫున భవిష్యత్తులో హిందూ ధర్మ పరిరక్షణకు మరిన్ని యాత్రలు చేసే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నానన్నారు.
అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టిటిడి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్న విధానం బాగుందని ప్రశంసించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.