ALIPIRI FOOTPATH WORKS GETS READY FOR DEVOTEES BY THIS BRAHMOTSAVAMS- TTD EO _ తిరుమల నడకదారి పైకప్పు పనులు పూర్తి – శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు అనుమతి : టిటిడి ఈవో
Tirumala, 29 September 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy has said that the roof slab renovation works of the Alipiri footpath taken up to facilitate the common devotees comfortable Yatra to Tirumala will be ready for use by the ensuing annual Srivari Brahmotsavams in October.
The EO who inspected the footpath works on Wednesday morning along with Additional EO Sri AV Dharma Reddy said the footpath walking will now provide a rich experience to all devotees with several added amenities. He said TTD has taken up several development works on the footpath like greenery, sanitation, lighting etc. That will enhance the walkathon journey a memorable experience to the pedestrian pilgrim.
He later directed the engineering officials to remove the debris of concrete material lying at several spots on the footpath immediately.
Earlier the TTD EO also inspected the development works at Sri Lakshmi Narasimha Swamy temple to Namala gopuram on the footpath route and made valuable suggestions to officials.
CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE-1 Sri Jagadeeshwar Reddy, Estate officer Sri Mallikarjuna, Health officer Dr Sridevi and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల, సెప్టెంబరు 29: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పై కప్పు పనులు దాదాపు పూర్తయిందని, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను అనుమతించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడక దారి పైకప్పు పనులను బుధవారం ఈవో, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో టిటిడి చేపట్టిన అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడక దారి పైకప్పు నిర్మాణ పనులు పూర్తయిందన్నారు. తద్వారా భక్తులు నడక మార్గంలో ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. భక్తులను నడకమార్గంలో అనుమతించిన తర్వాత కూడా టిటిడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పై కప్పు పునః నిర్మాణం సందర్భంగా తొలగించిన కాంక్రీట్ వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి నామాల గోపురం వరకు నిర్మించిన పై కప్పును, మార్గ మధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.