తి.తి.దే ప్రచురణ గ్రంథాలు ఆవిష్కరణ – గ్రంథ రచయితలకు సత్కరణ

తి.తి.దే ప్రచురణ గ్రంథాలు ఆవిష్కరణ – గ్రంథ రచయితలకు సత్కరణ

తిరుమల, 02  అక్టోబరు 2013 : తిరుమల తిరుపతి దేవాస్థానములు స్వీయ ప్రచురణలుగా ముద్రించిన ఆధ్యాత్మిక గ్రంథాలను శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆవిష్కరించి సత్కరించుట ఆనవాయితీ. అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాలలో కూడా 13 గ్రంథాలు ముద్రణ పూర్తి కాబడి ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు….
వ.సంఖ్య గ్రంథముల పేర్లు రచయిత పేరు భాష
1. నాయన్మారులు డా|| జయప్రకాష్‌ ఆంగ్లము
2. విష్ణు పురాణం శ్రీ యామిజాల పద్మనాభశాస్త్రి తెలుగు
3. తిరుమల-తిరుపతి-తిరుచానూరు శ్రీ యం.రామారావు తెలుగు
4. వేంకటాచల మహాత్మ్యం శ్రీ వెంకటరమణరావు హింది
5. వేంకటాచల మహాత్మ్యం శ్రీ సి.సుబ్బారావు ఆంగ్లము
6. ఏడుకొండలు శ్రీ జె.బాలసుబ్రహ్మణ్యం తెలుగు
7. శ్రీనివాస విలాసం శ్రీ యం. కొండమాచార్యులు తెలుగు
8. గ్లోరీ ఆఫ్‌ బ్రహ్మోత్సవమ్స్‌ శ్రీ టి. విశ్వనాథరావు ఆంగ్లము
9. కృష్ణ యజుర్వేదము-8 శ్రీ రామవరపు కృష్ణమూర్తిశాస్త్రి సంస్కృతం
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠం పక్షాన పునః ముద్రించిన గ్రంథాలుః-
1. బసవపురాణం, 2. సుభద్రా కల్యాణం, 3. సుగ్రీవ విజయం, 4. వేంకటేశ్వర వచనములు
పై తెలిపిన గ్రంథాలను శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2013 సందర్భంలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు జరుగు వాహన సేవలకు ముందు (కనీసం రెండు పుస్తకాలను) ఆవిష్కరించి మరియు పై గ్రంథాలలో తి.తి.దే మొదటిసారి ప్రచురిస్తున్న గ్రంథ రచయితులను, అనువాదకులను, రచయిత పరమపదించిన వారి వారసులను సత్కరించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.