KAMAKSHI ON TEPPA _ తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం

TIRUPATI, 04 JANUARY 2023: Sri Kamakshi Ammavaru took out a celestial ride on the finely decked float in Sri Kapileswara Swamy temple on Wednesday.

Temple officials and large number of devotees took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
 
తిరుపతి, 03 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.