SOMASKANDA ON TEPPA _ తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం
TIRUPATI, 03 JANUARY 2023: On the third day evening as a part of the ongoing Teppotsavams in Sri Kapileswara Swamy temple, Sri Somaskanda Swamy took out a celestial ride on float on Tuesday.
Devotees and temple officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం
తిరుపతి, 03 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ సోమస్కందస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సోమస్కందస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.