త్యాగరాజ కృతుల సంగీతోత్సవం

త్యాగరాజ కృతుల సంగీతోత్సవం

తిరుపతి, ఏప్రిల్‌-2, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర సంగీత నృత్యకళాశాల ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియం నందు రెండు రోజుల పాటు త్యాగరాజ కృతుల సంగీతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మహతిలో ఏర్పాటు చేస్తున్న ఈ త్యాగరాజ ఉత్సవాలలో చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌, కాకినాడ, నెల్లూరు ప్రాంతాల నుండి కళాకారులు విచ్చేస్తున్నారని, వీరేగాక ఎస్‌.వి. సంగీత కళాశాల కళాకారుల బృందం కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారని ఎస్‌.వి. సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి ఆర్‌.ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.