DON’T TRUST BROKERS FOR SRIVARI DARSHAN TICKETS- TTD CVSO _ దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి
దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి
తిరుమలలో దళారీ అరెస్ట్
తిరుమల, 2022 మార్చి 14: తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్లు, గదుల కోసం భక్తులు దళారులను నమ్మి మోసపోకండని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమలలో ఒక దళారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొంత కాలంగా వివిధ రకాలుగా భక్తులను మోసం చేస్తున్న దళారులు కొత్త మార్గంలో సామాజిక మాధ్యమాల వేదికగా మోసాలు చేస్తున్నారని తెలిపారు. టిటిడి ఉద్యోగులుగా, తిరుమలలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కొంపెళ్ల హరి నాగసాయి కార్తీక్ అలియాస్ హెచ్ఎన్ఎస్.కార్తీక్ అనే వ్యక్తి సత్యనారాయణ అవధాని అంబటిపూడి, గొల్లపల్లి శ్రీనివాస దీక్షితులు అనే పేర్లతో ఫేస్ బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించారని తెలిపారు. వీటి ద్వారా శ్రీవారి అభిషేకం, సుప్రభాతం, తోమాల, అర్చన, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తుల వద్ద నుంచి 7416606642, 8185920397, 9912372268 ఫోన్ నంబర్లతో గూగుల్ పే, ఫోన్ పే యాప్ల ద్వారా లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసినట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారని వెల్లడించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారని సివిఎస్వో తెలిపారు.
హెచ్ఎన్ఎస్.కార్తీక్ చాలా కేసుల్లో నిందితునిగా ఉన్నారని, అతనిపై త్వరలో సస్పెక్ట్ షీట్ పెడుతున్నామని సివిఎస్వో వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని సివిఎస్వో విజ్ఞప్తి చేశారు.
తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUMALA POLICE ARREST A BROKER ON A COMPLAINT FILED BY TTD VIGILANCE
Tirumala, 14 March 2022: TTD Chief Vigilance & Security officer Sri Gopinath Jatti on Monday exhorted the devotees, not to seek the help of brokers and conmen but to approach TTD officials and the TTD website for darshan and accommodation.
In a statement released on Monday, the CVSO said the brokers were now cheating the gullible devotees on new routes like the social media platforms by opening fake pages on Facebook, Telegram, Twitter claiming to be TTD employees and Archakas.
Citing an instance the CVSO mentioned that one broker Kompella Hari Nagasai Karthik@HNS Karthik had opened fake social media accounts in name of Satyanarayana Avadhani, Ambatipudi, Gollapalli Srinivasa Dikshitulu and through them has been found making offers of Srivari Abhisekam, Suprabatham, Tomala, Archana and VIP break darshan tickets.
Based on the complaint lodged by TTD Vigilance, the Tirumala Police arrested the broker and sent him to remand. CVSO said broker HNS Karthik was also involved in several crimes and a suspect sheet is being opened on him.
He appealed to devotees to not trust such brokers or unofficial sites but log onto TTD website only for booking Darshan, Arjita sevas tickets and Accommodation.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI