దాతలకు విజ్ఞప్తి
దాతలకు విజ్ఞప్తి
తిరుపతి ఫిబ్రవరి-16,2009 : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గల ఋషికేష్లోని ఆంధ్ర ఆశ్రమంలో భక్తులకు అన్నదానం చేసుకునే మహదవకాశం ధాతలకు కల్పించబడుచున్నది.
ప్రతి సంవత్సరం దేశంనలుమూలల నుండి వేల సంఖ్యలో ఋషికేష్, హరిద్వార్, బద్రీనాధ్, కేదారినాధ్ లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుండడం తెలిసిన విషయమే. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది అన్నది ఆర్యోక్తి, అన్నం పరబ్రహ్మాస్వరూపం. కనుక ఋషికేష్లోని ఆంధ్ర ఆశ్రమంలో అన్నదానాన్ని స్వచ్చందంగా నిర్వహించాలనే సంకల్పం వున్న దాతలు, స్వచ్చంద సేవా సంస్థలు, భక్తులు తమ సుముఖతను కార్యనిర్వహణాధికారి, తితిదే తిరుపతి వారికి తెలియజేయాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.