DURGASUKTAM RECITATIONS HELPS IN KEEPING AWAY ENEMIES _ దుర్గాసూక్తం పఠనంతో దుర్గతులు నశిస్తాయి : ఆచార్య అంబడిపూడి రాధేశ్యామ్
TIRUPATI, 30 JUNE 2023: By reciting Durga Suktam, it keeps away the enemies, said Prof. Radhesyam, the Registrar of SV Vedic University.
He was talking as a part of the ongoing week-long Chaturveda Havanam where in he gave elaborate details about the power and significance of Durga Suktam.
Meanwhile, on the second day, Vishnu Suktam, Garuda Suktam, Panchabhuta Mantras etc. were recited by Rutwiks.
In the evening the devotional cultural programmes allured the devotees while Brahmanda Nayakuni Brahmotsavam, Dance ballet choreographed by Sri Harnath of SV College of Music and Dance(SVCMD) remained as a special attraction.
దుర్గాసూక్తం పఠనంతో దుర్గతులు నశిస్తాయి : ఆచార్య అంబడిపూడి రాధేశ్యామ్
తిరుపతి, 2023, జూన్ 30: పరాక్రమానికి ప్రతిరూపమై దుష్టశిక్షణ చేసే దుర్గామాతను దుర్గాసూక్తం ద్వారా పఠిస్తే సంసార సాగరంలో ఉన్న దుర్గతులు తొలగిపోతాయని ఎస్వీ వేద వర్సిటీ రిజిస్టార్ ఆచార్య అంబడిపూడి రాధేశ్యామ్ ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. రాత్రి 7 గంటలకు ఆచార్య రాధేశ్యామ్ “దుర్గా సూక్తము – విశిష్టత” అనే అంశంపై ఉపన్యసిస్తూ దుర్గా సూక్తాన్ని పఠించడం ద్వారా శత్రుత్వం నశిస్తుందని, శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారని చెప్పారు. నిశ్చలంగా ఉన్న నీటిపై పడవ ప్రయాణం ఎంత హాయిగా సాగుతుందో, అదేతరహాలో దుర్గామాత మనల్ని రక్షించి సంసార సాగరాన్ని తేలికగా దాటిస్తుందన్నారు.
కాగా, ఉదయం చతుర్వేద హవనంలో భాగంగా విష్ణుసూక్తం, గరుడ సూక్తం, ఇంద్రాది దేవతలు, అగ్ని, వరుణ సంబంధిత వేదమంత్రాలు, పంచభూతాలను పవిత్రం చేసే దేవతా సూక్తాలను పండితులు పఠించారు.
ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు
సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు డా.కె.వి కృష్ణ బృందం వయోలిన్ కచేరీ జరిగింది. ఈ బృందానికి మృదంగంపై శ్రీ కె.యస్ శంకర్, ఘటంపై శ్రీ రఘురాం సహకారం అందించారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ వి.సురేష్ బాబు బృందం సంగీత కచేరీ నిర్వహించారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు శ్రీ సి.హరనాథ్ బృందం “బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం” నృత్య రూపకాన్ని చక్కటి హావభావాలతో
పద్రర్శించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్వీ సంగీత కశాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.