దేవికారాణికి ఇంగ్లాండు ఆహ్వానం
దేవికారాణికి ఇంగ్లాండు ఆహ్వానం
తిరుమల, 2010 జూన్ 10: శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి. కళాశాలలో యోగా డెమాన్‌స్ట్రేటర్ (టీచర్)గా పని చేస్తున్న బీమకోలం దేవికారాణిని ఇంగ్లాండు ఆహ్వానం పలికింది. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (ఐ.బి.సి), అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎ.బి.ఐ.) లు సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ పోరం 2010లో పాల్గొనడానికి ఇంగ్లాండు ఆహ్వానించింది.
ఈ వరల్డ్‌పోరం ఆగష్టు 17 నుంచి 22 వరకు కేంబ్రిడ్జియూనివర్శిటీలో జరగనుంది. అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎ.బి.ఐ.) కి అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. వరల్డ్ ఫోరం 2010లో పాల్గొనాలని కోరుతూ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (ఐ.బి.సి.) డైరెక్టర్ జనరల్ నికోలస్ ఎస్.లా అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎ.బి.ఐ.) ప్రెసిడెంట్ జె.పొ. ఈవన్స్ ఈమెకు ఓ లేఖ పంపారు. ఈమె పై రెండు సంస్థలు పలు అవార్డులను ఇది వరకు పొందియున్నారు.
సలహాదారునిగా నియామకం:
ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (ఐ.బి.సి.) డైరెక్టర్ జనరల్‌కు ముఖ్య సలహాదారుగా బి.దేవికారాణి నియమితులయ్యారు. ఈ మేరకు (ఐ.బి.సి.) డైరెక్టర్ జనరల్ నికోలస్ ఎస్.లా దేవికారాణి నియామక ఉత్తర్వులను పంపారు.
జీవితసాఫల్య పురస్కారం:
దేవికారాణిని ది వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ సంస్థ ”జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఈమె ఎంపికను ఖరారు చేస్తూ ఆసంస్థ అధ్యకక్షులు క్లైవ్‌ఎమ్మెట్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు దేవికారాణి ఆవార్డుకు ఎంపికైనట్లు ఆయన ఓ లేఖ ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా దేవికారాణి తనకు అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.