దేవుని కడప ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేత

దేవుని కడప ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేత.

తిరుపతి 2020 జూన్ 3: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. అధికార యంత్రాంగం ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించింది. దీంతో పోలీసుల సూచన మేరకు భక్తులకు స్వామి దర్శనాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే స్వామి వార్లకు జరిగే నిత్య కైంకర్యాలు, నైవేద్యాలు ఏకాంతంగా జరుగుతాయి. 

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది