SV GOSHALA TO BECOME A ROLE MODEL TO THE NATION- TTD EO _ ఆద‌ర్శ గోశాల‌గా ఎస్వీ గోశాల

EO INSPECTS WORKS ON FEED MIXING & GHEE MAKING PLANT AT GOSHALA

 

Tirupati, 15 July 2022: TTD EO Sri AV Dharma Reddy on Friday evening inspected the ongoing development works on the feed mixing Plant and ghee making units at the SV Godhala in Tirupati.

 

Earlier he also inspected the sheds for cows and ground for desi breeds viz. Kankrej, Gir, Sahiwal were brought from Northern states besides those bovines from Punganur and Ongole breeds.

 

He also enquired with officials on steps for their upkeep and suggestions for taking special care of them.

 

TTD EO also suggested the provision of pleasant music and quality feed and water in the Cowsheds.

 

Of the 18 sheds designed, four sheds were completed and the rest of 14 sheds are underway and the feed mixing plant to be operational by December.

 

He instructed officials to organise and keep the environment clean and pleasant to attract visitors.

 

The EO said TTD has acquired 100 special desi breeds of the 600 needed for the provision of ghee for conducting the Deeparadhana and daily naivedyam at Srivari temple.

 

He said TTD is striving to get the remaining animals through donations from philanthropists across the country.

 

EO also directed officials to take steps to procure internships for students of SV Veterinary University and colleges at the SV Goshala for the enhancement of their hands-on experience.

 

TTD JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, Goshala director Dr Harnath Reddy, SV Veterinary University extension Director Dr Venkata Naidu were also present.

  

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

దేశంలోనే ఆద‌ర్శ గోశాల‌గా ఎస్వీ గోశాల

– ఫీడ్ మిక్సింగ్, నెయ్యి త‌యారీ కేంద్రాల నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఈవో

 తిరుపతి, జులై 15, 2022: టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌ను మ‌రో ఏడాదిన్న‌ర‌లోగా దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన గోశాల‌గా అభివృద్ధి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌ను శుక్ర‌వారం సాయంత్రం ఈవో ప‌రిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌, నెయ్యి త‌యారీ కేంద్రం ప‌నుల‌ను ప‌రిశీలించారు.

అలాగే గోవ‌స‌తి షెడ్లు, అందులో గోవుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు ఇసుక‌తో ఏర్పాటుచేసిన మైదానం, ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి గోశాల‌కు తీసుకొచ్చిన కాంక్రీజ్‌, ఘిర్‌, సాహివాల్ జాతుల గోవుల‌తోపాటు పుంగ‌నూరు, ఒంగోలు జాతుల గోవుల‌ను ప‌రిశీలించి వాటి సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గోవ‌స‌తి షెడ్ల‌లో గోవుల‌కు ఆహ్లాదం క‌లిగించేలా ఏర్పాటుచేసిన సంగీతం బాగుంద‌ని, ఇక్క‌డ గోవుల‌కు నిరంత‌రం మేత, నీరు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 18 షెడ్ల‌కు గాను 4 షెడ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన 14 షెడ్ల నిర్మాణం వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. ఫీడ్‌మిక్సింగ్ ప్లాంట్ ప‌నులు డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గోశాల‌ను అందంగా ఉంచేందుకు, గోశాల‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులకు ఆహ్లాదక‌ర వాతావ‌ర‌ణం ఉండేలా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో దీపారాధ‌న‌, నైవేద్యాల త‌యారీకి అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి ఉత్ప‌త్తి చేసేందుకు సుమారు 600 గోవులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పారు. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు 100కు పైగా వివిధ దేశీయ‌జాతుల గోవుల‌ను స‌మ‌కూర్చుకున్నామ‌ని, మిగిలిన గోవుల‌ను దాత‌ల ద్వారా స‌మీక‌రించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యంతోపాటు దాని ప‌రిధిలోని క‌ళాశాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఎస్వీ గోశాల‌లో ఇంట‌ర్న్‌షిప్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనివ‌ల్ల విద్యార్థులకు ప‌రిజ్ఞానం పెర‌గ‌డంతోపాటు గోశాల‌కు వారి సేవ‌లు అందే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ప‌శువైద్య వ‌ర్సిటీ విస్త‌ర‌ణ సంచాల‌కులు డాక్ట‌ర్ వెంక‌ట‌నాయుడు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.