SPECIAL SOFTWARE FACILITATING SRIVARI DARSHAN TO DEVOTEES WHO MISSED DUE TO BAD WEATHER- ADDITIONAL EO _ ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తులకు తిరిగి స్లాట్ బుకింగ్‌ స‌దుపాయం – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 22 Nov. 21: For the sake of the pilgrims who could not make it for darshan due to inclement weather conditions in Tirumala and Tirupati in spite of having tickets, TTD has planned a special software for facilitating Srivari Darshan between November 18-30, said TTD Additional EO Sri AV Dharma Reddy.

A review meeting was held in Annamaiah Bhavan at Tirumala on Monday evening. The Additional EO said as per the directions of TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy, it has been decided that the devotees who missed Srivari Darshan in spite of valid tickets owing to bad weather conditions in Tirumala and Tirupati, such devotees will be facilitated with rescheduling darshan tickets which they could avail in six months. 

He directed the IT wing of TTD to develop separate software enabling the facility by November 30. The devotees who have darshan tickets between November 18 to 30 shall avail darshan with the same tickets in Tirumala before November 30. The devotees willing to have Srivari darshan from December onwards, shall have to reschedule their darshan date within six months by entering the old ticket number in the new software which will be available at their disposal from November 30, he added. He also directed the IT wing of TTD to ensure measures that their IT infrastructure remain tact and should not go down in any eventuality.

He also said, the devotees shall come for Srivari darshan without any fear. Due to the recent unprecedented downpour, only two suites out of 7000 rooms in Tirumala got affected. These two rooms in Narayanagiri Rest House were directed to repair and put back into operation as early as possible.

He said, there was no damage to the Alipiri footpath route, however the Srivarimettu footpath route got affected due to the damage caused to the four culverts following heavy rains. As there is no possibility of any transportation mechanism in this route, the repair works of this footpath will take some time to be put back into use and temporarily shut down as of now”, he said.

Later he instructed all the concerned to ensure steps to drain out rain water stagnates inside Srivari temple and take up the repair works on war-footing at Vaikuntham Queue Complex Gardens, Museum etc.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తులకు తిరిగి స్లాట్ బుకింగ్‌ స‌దుపాయం

ఘాట్ రోడ్ల‌లో ర‌వాణాకు ఎలాంటి ఇబ్బంది లేదు

అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో అనుమ‌తి

భ‌క్తులు నిర్భ‌యంగా వ‌చ్చి శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల‌, 2021 నవంబరు 22: భారీ వ‌ర్షం కార‌ణంగా న‌వంబ‌రు 18 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేని భ‌క్తులకు మ‌రో స‌మ‌యంలో తిరిగి ద‌ర్శ‌నం, బ‌స‌ క‌ల్పించాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశించార‌ని, ఈ మేర‌కు ద‌ర్శ‌నం, గ‌దులు బుక్ చేసుకున్న భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్ రూపొందించి 6 నెల‌ల్లోపు తిరిగి స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని , స‌ర్వ‌ద‌ర్శ‌నం, రూ.300/- ద‌ర్శ‌నం, వ‌ర్చువ‌ల్ సేవ‌లు, శ్రీ‌వాణి ట్ర‌స్టు భ‌క్తుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వనంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో సమీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ న‌వంబ‌రు 18వ తేదీ నుండి ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తులు న‌వంబ‌రు 30వ తేదీలోపు తిరుమ‌ల‌కు వ‌స్తే ద‌ర్శ‌నానికి అనుమ‌తించి ల‌డ్డూ ప్ర‌సాదాలు అంద‌జేస్తామ‌న్నారు. ద‌ర్శ‌న టికెట్లు ఉండి న‌వంబ‌రు 30వ తేదీ త‌రువాత ద‌ర్శనానికి రాద‌లిచిన భ‌క్తులు సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్‌లో 6 నెల‌ల్లోపు తిరిగి ద‌ర్శ‌న స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

తిరుమ‌ల‌లో అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైనా ఒక‌టి, రెండు ప్ర‌దేశాలు మిన‌హా పెద్ద‌గా న‌ష్టం వాటిళ్ల‌లేదని, తిరుమ‌ల చ‌క్క‌గా ఉంద‌ని, భ‌క్తులు నిర్భయంగా వ‌చ్చి స్వామివారి ద‌ర్శించుకోవ‌చ్చ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అలిపిరి నుంచి తిరుమ‌లకు వ‌చ్చే ఘాట్ రోడ్డ‌లో 13 చోట్ల వ‌ర్షానికి భూమి నాని వ‌దులుకావ‌డంతో ర‌క్ష‌ణ గోడ‌లు జారి రోడ్డుకు అడ్డంగా ప‌డ్డాయ‌ని, ప‌లు చోట్ల చెట్ల కూలాయ‌ని, వీట‌న్నింటినీ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న తొల‌గించామ‌ని, ప్ర‌స్తుతం ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు. తిరుమ‌ల నుండి తిరుమ‌ల‌కు వెళ్లే రోడ్డులోనూ ఎలాంటి స‌మ‌స్య లేద‌న్నారు. ఈ రెండు ఘాట్ రోడ్ల‌లో నాలుగు రోజుల నుండి వాహ‌నాలు చ‌క్క‌గా ప్ర‌యాణిస్తున్నాయ‌ని, భ‌క్తులు నిస్సంకోచంగా స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌చ్చ‌ని తెలియ‌జేశారు.

అలిపిరి మార్గంలోని న‌డ‌క‌దారి చ‌క్క‌గా ఉంద‌ని, భ‌క్తులు న‌డిచి తిరుమ‌ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని వివ‌రించారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలో నాలుగు క‌ల్వ‌ర్టులు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పారు. సామ‌ర్థ్యానికి మించి వ‌ర్ష‌పు నీరు రావ‌డం, నీటిప్ర‌వాహంతోపాటు బండ‌రాళ్లు వేగంగా వ‌చ్చి ఢీకొన‌డంతో క‌ల్వ‌ర్టులు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు. క‌ల్వ‌ర్టుల వ‌ద్దకు వాహ‌నాలు వెళ్ల‌డానికి రోడ్డు సౌక‌ర్యం లేద‌ని, వీటి పున‌ర్నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని మ‌నుషులే తీసుకువెళ్లాల్సి రావ‌డంతో ఆల‌స్య‌మ‌వుతోంద‌ని చెప్పారు. భ‌క్తులు న‌డించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, అంత‌వ‌ర‌కు ఈ మార్గం మూసి ఉంటుంద‌ని అన్నారు.

న‌వంబ‌రు 25 నుండి 28వ తేదీ వ‌ర‌కు తిరిగి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించార‌ని, ఈ మేర‌కు ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు టిటిడిలోని ఇంజినీరింగ్‌, అట‌వీ, ఆరోగ్య, భ‌ద్ర‌త త‌దిత‌ర అన్ని విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని తెలిపారు. ఇందుకు అవ‌స‌ర‌మైన జెసిబిలు, హిటాచీలు, ట్ర‌క్కులు, చెట్లు కూలితే వెంట‌నే తొల‌గించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు.

బ‌స‌కు సంబంధించి తిరుమ‌ల‌ నారాయ‌ణ‌గిరి విశ్రాంతి గృహంలో రెండు గ‌దులు మాత్ర‌మే దెబ్బ‌తిన్నాయ‌ని, మిగ‌తా చోట్ల 7 వేల గ‌దుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని తెలిపారు. ఐటి విభాగం అధికారులు ఈ అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వ‌ర్షానికి స‌ర్వ‌ర్లు డౌన్ అవ‌కుండా త‌గిన మౌలిక వ‌స‌తులు స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. అన్న‌దానం, క‌ల్యాణ‌క‌ట్ట‌, శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఎలాంటి ఇబ్బందు లేవ‌ని, భ‌క్తులు నిస్సంకోచంగా తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలియ‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.