RS.300 ONLINE BOOKING ISSUE WILL BE ADDRESSED SOON THROUGH CLOUD MANAGEMENT-EO _ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తాం : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

TIRUMALA, 04 SEPTEMBER 2021: The technical issues pertaining to Rs.300 on-line darshan tickets will be addressed soon through cloud management with a structured, risk-mitigated approach said TTD EO Dr KS Jawahar Reddy.

While attending to the calls of pilgrims across during the monthly Dial your EO programme held at Conference Hall in Tirupati on Saturday, many pilgrim callers brought to the notice of EO about the hanging of the system during online booking of Rs.300 tickets. Replying to them, the EO said, the technical issue will be overcome soon with Cloud management technology and the IT department is working on the same.

Callers, Sri Lakshmi Narasimha from Hyderabad, Sri Srinivas from Visakhapatnam and many other callers complemented TTD of the various Parayanams which are being live telecasted on SVBC every day and sought to continue them forever as they have a very good impact on the children. Replying to them the EO said, TTD will continue these programmes forever for the benefit of the humans. 

Another caller Sri Srinivas suggested EO to release the Parayanams in the form of CDs to which EO answered that the process is already underway.

A caller Sri Srinivas from Khammam suggested EO to write the slogans from Gita and other epics on the walls of all TTD temples, to which the answered suggestion will be looked into.

Sri Srinivas from Gajupeta suggested EO to look into the possibilities of telecasting SVBC also free to air on the lines of Door Darshan. 

Sri Satish from Uyyuru informed EO to conduct Dharma Parichayam and Dharma Pravesika exams to which the EO said due to the Covid pandemic, the exams have been stalled and will be conducted soon.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti and other senior officers of TTD were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తాం : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమల, 04 సెప్టెంబ‌రు 2021: ప్ర‌తి నెలా విడుద‌ల చేస్తున్న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తామ‌ని, దీనికి క్లౌడ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ ద్వారా ప‌రిష్కారం చూపుతామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. శ్రీ‌నివాస‌రావు – తెనాలి

ప్రశ్న: అన్న‌మాచార్య సంకీర్త‌న‌లు, గోవింద‌నామాలు ప్ర‌చారం చేస్తున్నాం. నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఉద‌యం ఈ కీర్త‌న‌లు పాడే అవ‌కాశం క‌ల్పించండి?

ఈవో : మీతో చ‌ర్చించి అవ‌కాశం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాం.

2. ల‌క్ష్మీ న‌ర‌సింహ – హైద‌రాబాద్‌, జ‌య‌దేవ‌రెడ్డి – వ‌రంగ‌ల్‌

ప్రశ్న: కోవిడ్ స‌మ‌యంలో చ‌క్క‌టి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి గారికి అభినంద‌న‌లు. రామ‌కృష్ణ సోమ‌యాజి గారు కొంత‌కాలం ప్ర‌వ‌చ‌నం చెప్ప‌లేక‌పోయారు, బాల‌కాండ పారాయ‌ణం స‌మ‌యం పెంచండి.

ఈవో : ధ‌న్య‌వాదాలు. రామ‌కృష్ణ సోమ‌యాజి గారు కోవిడ్ వ‌ల్ల కొంత‌కాలం హాజ‌రుకాలేదు. బాల‌కాండ పారాయ‌ణం స‌మ‌యం పెంచుతాం.

3. ర‌వికుమార్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మ‌ల్లీశ్వ‌రి – ముదినేప‌ల్లి, శ్రీ‌నివాస‌రెడ్డి – నెల్లూరు, ర‌మేష్ – మ‌ద‌న‌ప‌ల్లి

ప్రశ్న: రూ.300/- టికెట్లు బుక్ చేసుకోవ‌డంతో స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. వెబ్‌సైట్ స‌రిగా ప‌నిచేయ‌డం లేదు ?

ఈవో : ఈ స‌మ‌స్య‌ను గుర్తించాం. టిటిడికి సాంకేతిక స‌హ‌కారం అందిస్తున్న సంస్థ‌ల‌తో చ‌ర్చించి క్లౌడ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ ద్వారా త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తాం.

4. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి – హైద‌రాబాద్‌

ప్రశ్న: రూ.300/- టికెట్ల వ‌ల్ల టిటిడికి బాగా ఆదాయం వ‌స్తోంది. ల‌డ్డూ ప్ర‌సాదం ధ‌ర‌లు, పుస్త‌కాల ధ‌ర‌లు త‌గ్గించండి?

ఈవో : ఆధ్యాత్మిక పుస్త‌కాల ధ‌ర‌ల త‌గ్గింపును ప‌రిశీలిస్తాం. తిరుమ‌ల‌లో వెంగ‌మాంబ భ‌వ‌నంలో ఉచిత అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ య‌థావిధిగా జ‌రుగుతుంది. భ‌క్తుల‌కు మంచి ఆహారం అందించాల‌నే ఉద్దేశంతో దాత‌ల స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో సంప్ర‌దాయ భోజ‌నం ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించాం. దీనిపై కొంత మంది అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌డం బాధాక‌రం.

5. సుబ్ర‌మ‌ణ్యం – హైద‌రాబాద్‌

ప్రశ్న: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌స‌తి గ‌దుల బుకింగ్‌లో ప్రాధాన్యం ఉందా ?

ఈవో : ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తాం.

6. శ్రీ‌నివాస్ – వైజాగ్‌

ప్రశ్న: సుంద‌ర‌కాండ, గీతా పారాయ‌ణం కార్య‌క్ర‌మాల‌ను సిడిల రూపంలో విడుద‌ల చేయండి ?

ఈవో : సుంద‌ర‌కాండ, గీతా పారాయ‌ణం శ్లోకాల‌ను త్వ‌ర‌లో పుస్త‌క‌రూపంలోకి, సిడిల రూపంలోకి తీసుకొస్తాం.

7. స‌తీష్ – ఉయ్యూరు

ప్రశ్న: రెండేళ్లుగా ధ‌ర్మ‌ప‌రిచ‌యం, ధ‌ర్మ‌ప్ర‌వేశిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం లేదు ? అఖండ హ‌రినామ సంకీర్త‌న‌ను తిరిగి ప్రారంభించండి.

ఈవో : క‌రోనా కార‌ణంగా ధ‌ర్మ‌ప‌రిచ‌యం, ధ‌ర్మ‌ప్ర‌వేశిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంలో ఆల‌స్యమైంది. త్వ‌ర‌లో నిర్వ‌హిస్తాం. నాద‌నీరాజ‌నం వేదిక‌పై కార్య‌క్ర‌మాలు ఎక్కువగా ఉన్న కార‌ణంగా అఖండ హ‌రినామ సంకీర్త‌న‌ను ఇప్ప‌ట్లో ప్రారంభించ‌లేం.

8. న‌రేంద్ర – హైద‌రాబాద్‌

ప్రశ్న: టిటిడి ఉద్యోగులు గోవింద‌నామాలు ధ‌రించేలా చూడండి.

ఈవో : ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు డ్రెస్‌కోడ్ అమ‌లు చేస్తున్నాం. గోవింద‌నామాలు ధ‌రింప‌చేసే అంశాన్ని ప‌రిశీలిస్తాం.

9. శ్రీ‌నివాస్ – గాజుపేట

ప్రశ్న: దూర‌ద‌ర్శ‌న్ త‌ర‌హాలో ఎస్వీబీసీ ఛాన‌ల్‌ను ఉచితంగా వీక్షించే అవ‌కాశం క‌ల్పించండి.

ఈవో : ఎస్వీబీసీ ఛాన‌ల్‌ను ఉచితంగా ప్ర‌సారం చేస్తున్నాం.

10. శ్రీ‌నివాస్ – ఖ‌మ్మం

ప్రశ్న: టిటిడి ఆల‌యాల గోడ‌ల‌పై భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు, అన్న‌మాచార్య కీర్త‌న‌లు రాయించండి.

ఈవో : ప‌రిశీలిస్తాం.

11. న‌రేంద్ర – హైద‌రాబాద్‌

ప్రశ్న: నేను స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక జీవిత చందాదారుడిని. ప‌త్రిక‌ను ఎప్పుడు పంపిస్తారు?

ఈవో : అక్టోబ‌రు నెల నుండి మీకు ప‌త్రిక కాపీని పోస్ట‌ల్ ద్వారా పంపుతాం.

12. భాను – హైద‌రాబాద్‌

ప్రశ్న: ఇత‌రుల పేరుతో అన్న‌దానానికి విరాళం ఇస్తే మాకు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుందా?

ఈవో : ఈ విష‌యాన్ని ప‌రిశీలించి మీకు తెలియ‌జేస్తాం.

13. నాగ‌మ‌ణి – కృష్ణా జిల్లా

ప్రశ్న: శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి భ‌క్తుల‌ను ఎప్పుడు అనుమ‌తిస్తారు ?

ఈవో : కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు కోవిడ్ పూర్తిగా త‌గ్గాక భ‌క్తుల‌ను శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తిస్తాం.

14. ర‌వి – తిరుప‌తి

ప్రశ్న: అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం నుండి వెలుప‌లికి వ‌చ్చే మార్గంలో పాన్ అమ్ముతున్నారు?

ఈవో : ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

15. మోహ‌న్ – విజ‌య‌వాడ‌

ప్రశ్న: 20 ఏళ్ల క్రితం తిరుప్పావ‌డ సేవ బుక్ చేసుకున్నాం. కోవిడ్ వ‌ల్ల ఈ సేవ ర‌ద్ద‌యింది. మ‌రో సంద‌ర్భంలో కేటాయించండి ?

ఈవో : తిరుప్పావ‌డ సేవను భ‌విష్య‌త్తులో తిరిగి కేటాయించ‌డానికి వీలు కాదు. మిమ్మ‌ల్ని బ్రేక్ ద‌ర్శ‌నంలో అనుమ‌తిస్తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.