ధర్మగిరిలో వినాయక స్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు
ధర్మగిరిలో వినాయక స్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు
తిరుమల, 6-సెప్టెంబరు 2013 : తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో ఈనెల 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ప్రయోగాత్మకంగా శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
తొలిరోజు సాయంత్రం 5.30 గంటలకు నవకలశ స్థాపనంతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా 9వ తేది వినాయకచవితిని పురష్కరించుకుని మహాగణపతి హవనం నిర్వహించనున్నారు. ఇక చివరి రోజున అంటే సెప్టెంబరు 17వ తేదీన శ్రీ వినాయకస్వామివారి ఊరేగింపు, అవబృదయాగం మరియు మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.