MAHANYASAPURVAKA RUDRABHISHEKAM PERFORMED _ ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
Tirupati, 11 Mar. 21: On the auspicious occasion of Maha Sivarathri on Thursday, Mahanyasapurvaka Rudrabhishekam was performed in Dhyanaramam located in Vedic University premises.
This special abhishekam commenced at 7am and lasted for over two hours and was telecasted live on SVBC for the sake of global devotees. The mammoth Siva Linga was rendered abhishekam amidst chanting of Rudram, Namaka and Chamaka mantras for eleven times.
The Vedic scholars narrated that by doing Ekadasa Rudrabhishekam on Maha Sivarathri will yield prosperity and free from all dangers and diseases.
TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, SV Vedic University Vice-Chancellor Acharya Sannidhanam Sudarshana Sharma, SVBC CEO Sri Suresh Kumar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
తిరుపతి, 2021 మార్చి 11: టిటిడి చేపట్టిన మాఘ మాస ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా భారీ శివలింగానికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. మహాశివరాత్రి రోజున నిర్వహించే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ జి.సురేష్ కుమార్, వేద వర్సిటీ ఆచార్యులు, వేదపండితులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.