BTU OF SRINIVASA MANGAPURAM TEMPLE BEGINS WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 29 February 2024: The annual Brahmotsavam of Sri Kalyana Venkateswara temple commenced on a religious note on Thursday with a grand Dwajarohanam fete amidst mangala vaidyams and chanting by Veda Pundits and Govinda Namas by devotees.

Earlier Tiruchi utsavam was observed signalling Swamis personal supervision of all arrangements ahead of rituals and Dwajarohanam and indicative of inviting all deities under the guidance of Kankana Bhattar Sri Seshacharya 

Elaborate preparations: JEO Sri Veerabrahmam 

Speaking on the occasion JEO Sri Veerabrahmam said extensive arrangements were being made for the nine-day fete including the provision of srivari laddus to devotees. He said Garuda Seva will be held on March 4, Swarna Ratham on 5, Rathotsavam on 7, Chakra Snanam on 8 and that Vahana Sevas will be conducted both in the morning and evening.

Two umbrellas donated 

Representatives of Sri Ramanuja Trust of Tiruniravuru, Tamilnadu presented two umbrellas which were received by JEO Sri Veerabrahmam in front of the temple.

Temple special officer and CPRO Dr TRavi, special grade DyEO Smt Varalakshmi, Vaikhanasa Agama adviser Srinivas Mohana Rangacharyulu, AEO Sri Gopinath and others, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 29 : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్‌ శ్రీ శేషాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : జేఈవో శ్రీ వీరబ్రహ్మం

జేఈవో శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 29 నుండి మార్చి 8వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీ‌నివాస‌మంగాపురంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4న గరుడసేవ, మార్చి 5న స్వర్ణరథోత్సవం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

రెండు గొడుగులు విరాళం

తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్ర‌తినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌ట‌స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.