DHWAJAROHANAM HELD _ ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 

TIRUPATI, 04 MAY 2023: The Dhwajarohanam for the annual brahmotsavams at Sri Veda Narayana Swamy temple at Nagulapuram was observed on Thursday.

The annual fete will conclude on May 12 with Garuda Seva on May 8. 

DyEO Smt Nagaratna and other temple officials were present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 04: నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

గురువారం ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. ఉదయం 8.40 నుండి 9.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా కొత్త వస్త్రంపై గరుత్మంతుని బొమ్మ గీసి పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5.15 గంటల నుండి ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ ఏకాంబరం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ శ్రీనివాసులు, శ్రీ ఉద‌య్‌కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.