DWAJAROHANAM HELD AT CHANDRAGIRI KODANDA RAMA TEMPLE BTU _ ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 10 April 2022: As part of the annual Brahmotsavam of the Sri Kodandaramalayam at Chandragiri, TTD organised a grand dwajarohanam fete on Sunday in the auspicious Mesha lagnam between 7am and 7.45 am.

The Kankana Bhattar Sri Srinivasa Bhattar supervised the fete, which included special puja to Dwajasthambha before unfurling the Dwaja Patan amidst Veda mantras.

Earlier Nitya kaikaryas were performed in the morning and daily Unjal Seva will be performed in the evening.

On April 14 Hanumantha Vahana Seva will be observed.

Sri Sitaram kalyanam will be performed on April 16 in which devotees shall participate with a ₹750 ticket on which two persons will be allowed.

Garuda Vahana Seva will be held on the same day in the evening.

On April 18 morning grand Snapana Tirumanjanam will be held for utsava idols and Chakrathalwar and the Brahmotsavam celebrations concludes in the night with the Dwajavarohanam fete.

On April 19 evening TTD is organising the celestial event of Sri Rama Pattabhisekam.

Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Srinivasulu, temple inspector Sri Krishna Chaitanya and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2022 ఏప్రిల్ 10: చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉదయం 7 నుండి 7.45 గంటల మ‌ధ్య మేష‌ లగ్నంలో ఈ ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ శ్రీ‌నివాస బ‌ట్ట‌ర్‌ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ముందుగా ఉదయం 5 గంటలకు సుప్ర‌భాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, శుద్ధి నిర్వ‌హించారు. ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.45 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఏప్రిల్ 16వ తేదీ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.750/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వర్ల‌కు, చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఉద‌యం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ‌చైత‌న్య‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.