FOOTPATH VENDORS GIVEN INSTRUCTIONS _ న‌డ‌క‌మార్గాల్లో దుకాణ‌దారుల‌కు ప‌లు సూచ‌న‌లు

TIRUMALA, 18 AUGUST 2023: In the wake of wild animals movements at different areas along the footpath routes, TTD has issued some guidelines and instructions to the footpath route shopkeepers.

A meeting was held at the Conference Hall in TTD administrative building in Tirupati on Friday evening headed by TTD EO Sri AV Dharma Reddy with TTD, forest, police officials and shopkeepers of the footpath routes.

It has been decided to stall the sale of fruits and vegetables along the footpath route. Henceforth the sale of fruits and vegetables will not be allowed as the pedestrian pilgrims are purchasing them and feeding the monkeys, deer etc. This in turn is resulting in the intrusion of wild beasts which are posing a threat to the lives of trekkers.

To avoid such man-wild animal conflict, TTD has completely banned the sale of fruits and vegetables.

Similarly, all the 100-plus footpath shopkeepers along the Alipiri route are instructed to keep the premises clean and dump the waste in twin bins segregating dry and wet wastes. Everyday nearly 2-3 tons of garbage is being piled up along the footpath route and removed by the Health Department of TTD regularly.

If the footpath vendors come across the movement of wild beasts, they should immediately inform the Forest or TTD officials and tge respective phone numbers to be displayed at the footpath route.

Very soon CC cameras will be installed all along the footpath route.

If any shopkeeper finds violating the above guidelines, serious action will be initiated against such violators, EO maintained.

JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, CCF Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Deputy CF of TTD Sri Srinivas, Health Officer Dr Sridevi, VGOs Sri Bali Reddy, Sri Giridhar Rao, Estates Wing Special Officer Sri Mallikharjuna and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌డ‌క‌మార్గాల్లో దుకాణ‌దారుల‌కు ప‌లు సూచ‌న‌లు

తిరుమల, 2023 ఆగస్టు 18: నడ‌క మార్గాల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా దుకాణదారుల‌కు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహ‌కుల‌తో ఈవో శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించి ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ న‌డ‌క‌మార్గాల్లో విక్ర‌యాల‌కు సంబంధించి అట‌వీ, ఎస్టేట్‌, ఆరోగ్య‌శాఖ‌ల అధికారుల‌తో పాటు ప‌లువురు భ‌క్తులు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు చెప్పారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్ర‌యించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌రాద‌ని సూచించారు. భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. అన్ని దుకాణాల వ‌ద్ద త‌డి చెత్త‌ను, పొడి చెత్త‌ను వేరువేరుగా చెత్త‌కుండీల్లో వేయాల‌ని, అలా చేయ‌ని వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. న‌డ‌క మార్గంలో రోజుకు రెండు నుండి మూడు ట‌న్నుల చెత్త పోగ‌వుతోంద‌ని, వీటిని ఆరోగ్య శాఖ సిబ్బంది క్ర‌మం త‌ప్ప‌కుండా తొల‌గిస్తున్నార‌ని చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సిసికెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌న్నారు. క్రూర‌మృగాల జాడ క‌నిపిస్తే వెంట‌నే తెలిపేందుకు వీలుగా అట‌వీ, ఆరోగ్య‌, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబ‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో ఏఎస్పీ శ్రీ మునిరామయ్య, సిసిఎఫ్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, టీటీడీ ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, తిరుప‌తి డిఎఫ్‌వో శ్రీ స‌తీష్‌, టీటీడీ డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాస్‌, ఎస్టేట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ మ‌ల్లికార్జున‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, ఇఇ శ్రీ సురేంద్ర‌నాథ్‌రెడ్డి, డిఇ ఎల‌క్ట్రిక‌ల్ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధ‌ర్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.