PUSHPAYAGAM ON NOVEMBER 11 _ నవంబరు 11న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

నవంబరు 11న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల, 2021  న‌వంబరు 09: నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా వర్చువల్  ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUMALA, 09 NOVEMBER 2021: The annual Pushpayaga Mahotsavam will be observed in Sri Venkateswara Swamy temple at Tirumala on November 11 with Ankurarpanam on November 10.

After the second bell and Naivedyam, the Utsava Murthies of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi will be taken to Kalyanotsava Mandapam and Snapana Tirumanjanam will be performed.

 Later in the afternoon, between 1pm and 5pm, Pushpayagam will be performed with different flowers, aromatic leaves in a colourful manner amidst chanting of Vedic mantras.

TTD has cancelled all virtual sevas for the day including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam in connection with this festival. In the evening, the deities will bless devotees along four mada streets after Sahasra Deepalankara Seva.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI