LADDU, VADA PRASADAM TO RETIRED STAFF _ నవంబరు 12 నుండి 19వ తేదీ వరకు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
Tirupati, 7 Nov. 19: TTD will distribute Brahmotsava Laddu, Vada Prasadams to all its retired employees from November 12 to 19.
This distribution will take place in the order of their pension numbers designated for each date as follows.
November 12-From PPO number 99-2914, November 13-2915 to 4367
November 14-4368 to 5673
November 15-5675 to 6881 and remaining on November 16, 18 and 19.T
The distribution will take place in TTD Pensioners’ Welfare Association Office Recreation Hall from 10:30am onwards on these days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
నవంబరు 12 నుండి 19వ తేదీ వరకు: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 12 నుండి 19వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టిటిడి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయ సమీపంలోని రిక్రియేషన్ హాల్లో ఉదయం 10.30 గంటల నుండి ప్రసాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లకు ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబరు 12న 99 నుండి 2,914 వరకు, నవంబరు 13న 2,915 నుండి 4,367 వరకు, నవంబరు 14న 4,368 నుండి 5,673 వరకు, నవంబరు 15న 5,675 నుండి 6,881 వరకు, నవంబరు 16 నుండి 19వ తేదీ వరకు మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.