EO REVIEWS ON VISAKHA DEEPOTSAVAM _ నవంబరు 14న విశాఖలో కార్తీక మహాదీపోత్సవంపై ఈవో సమీక్ష
TIRUPATI, 11 NOVEMBER 2022: TTD EO Sri AV Dharma Reddy along with JEO(E&H) Smt Sada Bhargavi reviewed on the arrangements to be made in RK Beach in Visakhapatnam for Karthika Deepotsavam scheduled to take place November 14.
The review meeting was held in TTD administrative building Conference Hall on friday evening. EO directed all the officials concerned to work with cooperation and coordination and make the event is a grand success.
He said that the devotees who are going to participate in the Mega religious event shall be issued passes in advance. They shall be advised to participate in traditional dress only and also informed about the program by giving a small booklet with the information on the significance of Karthika deepotsavam before the commencement of the programme. He also instructed to follow the time schedule without giving much gap to the series of events which were planned on the occasion and complete the event within the time frame.
SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, DE Electrical Sri Ravishankar Reddy, donors Sri Rajesh, Sri Krishna Prasad, Sri Himanshu Prasad, Vedic SV Varsity Director Sri Rani Sada Siva Murty, SV music and dance college Principal Sri Sudhakar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 14న విశాఖలో కార్తీక మహాదీపోత్సవంపై ఈవో సమీక్ష
తిరుపతి, 2022 నవంబరు 11: విశాఖపట్నంలో నవంబరు 14న కార్తీక మహాదీపోత్సవం నిర్వహణపై టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం జెఈవో శ్రీమతి సదా భార్గవితో కలిసి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి దీపోత్సవాన్ని జయప్రదం చేయాలన్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ముందస్తుగా పాసులు మంజూరు చేయాలని, సంప్రదాయ దుస్తుల్లో రావాలని తెలియజేయాలని సూచించారు. భక్తులందరికీ కార్యక్రమ బుక్‌లెట్ అందించి మొదట్లో చక్కగా మార్గదర్శనం చేయాలన్నారు. కార్తీకదీప మహత్యాన్ని స్థూలంగా తెలియజేయాలని కోరారు. ఒక కార్యక్రమానికి మరో కార్యక్రమానికి మధ్య విరామం ఉండకూడదన్నారు. ప్రముఖ విద్వాంసులు శ్రీ చైతన్య బ్రదర్స్ అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన నృత్యరూపకాన్ని స్థానిక కళాకారులు ప్రదర్శిస్తారని చెప్పారు. దీపారాధన తరువాత భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఆయన జెఈవోను కోరారు. కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమీక్షలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, దాతలు శ్రీ రాజేష్, శ్రీ కృష్ణప్రసాద్, శ్రీ హిమాంశుప్రసాద్, ఎస్వీ వేద వర్సిటీ డైరెక్టర్ శ్రీ రాణిసదాశివమూర్తి, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.