నవంబర్‌ 13 నుండి 21 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

నవంబర్‌ 13 నుండి 21 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, నవంబర్‌-09, 2009 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 13 నుండి 21 వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నవంబర్‌ 12వ తేది గురువారం ఉదయం 7.00 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారికి లక్షకుంకుమార్చన భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రముఖ కళాకారులచే వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ వివరాలను ఇందు వెంట జతపరుస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.