నవంబర్‌ 4న క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం

నవంబర్‌ 4న క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం

తిరుపతి, నవంబర్‌-03,2009: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం నవంబర్‌ 4వ తేది సాయంత్రం 4 గంటలకు తితిదే పరిపాలన భవనం వెనుక వైపునున్న మైదానంలో జరుగుతుంది.

క్రీడలలో గెలుపొందిన ఉద్యోగులతో పాటు ఆగష్టు 15వ తేదిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ ఈసందర్భంగా ప్రధానం చేస్తారు.

కనుక ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. అదే విధంగా ఒక వేళ వర్షం వస్తే, కార్యక్రమ వేదికను మహతి ఆడిటోరియంనకు మార్చే అవకాశం వుంది. గమనించ ప్రార్థన.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.