నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు

నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు
 
తిరుమల, 2023 అక్టోబ‌రు 19 ; శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని నానీరాజ‌నం వేదిక‌పై జ‌రుగుతున్న శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు గురువారం ఐదో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఆచార్య రాణిసదాశివమూర్తి “వేదఖిలో ధర్మమూలం” అనే అంశంపై ఉప‌న్య‌సించారు. ముందుగా చతుర్వేద పండితులు వేదపారాయణం చేశారు.
 
నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న‌ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు
 
తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం సాయంత్రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ గాయకులు ఆచార్య శైలేశ్వరి బృందం ఆలపించిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు భక్తిభావాన్ని పంచాయి.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.