నాదనీరాజనానికి విశేష ప్రజాదరణ
నాదనీరాజనానికి విశేష ప్రజాదరణ
తిరుమల, అక్టోబర్-02, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు నాదనీరాజనం మండపంలో నిర్వహించబడుచున్న నాదనీరాజనం కార్యక్రమములు ఇప్పటికే విశేషప్రజాధరణ పొందిన మాట విధితమే. ప్రఖ్యాత విద్వాంసులచే నిర్వహించబడుచున్న సంగీత, భజన కార్యక్రమములు భక్తులను ప్రతి నిత్యం భక్తితత్వంలో ఓలలాడిస్తున్నాయి. భగవంతుని కీర్తనలకు భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ ఆలాపనలకు భక్తజనం సహితం శృతి కల్పుతున్నారు. ఈకార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ తిరుమల నుండి ప్రతి రోజు రాత్రి 7గంటల నుంచి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నది. ఈ కార్యక్రమములో అక్టోబర్ నెలలో పాల్గొనబోవు విశిష్ఠ కళాకారులు, ఇతర కార్యక్రమముల వివరములు పొందుపరచి పంపుతున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.